Thursday 6 July 2017

KB Meeravali,ACS: కమిటీ రిపోర్ట్ అమలు విషయంలో తాత్సారం చేస్తున్న పోస్టల్ డిపార్ట్ మెంట్ , సెంట్రల్ యూనియన్ సీరియస్, 12-07 నిరహారదీక్ష ప్రోగ్రాం సిన్సియర్ గా , బాగా ఎఫెక్టివ్ గా చేయాలని యూనియన్ ఆదేశం, మన సత్తా ఏంటో తెలియజేసే టైమ్ ఆసన్నమైంది , మనకోసం ఎవరో ఒకరు పోరాటాలు చేస్తారనే విషయాన్ని విడనాడుదాం- పోరాటాలు చేసి నేనే సాధించాను అనే ఆలోచనకు వద్దాం. ఈ నిరహారదీక్షతో తిరుగుబాటు అంటే ఇలా ఉంటదా అని డిపార్ట్ మెంట్ కు తెలియాలి , ఈ విషయంలో ప్రభుత్వానిది ఎటువంటి తప్పులేదు, మనలని మోసం చేస్తున్నది తపాళాశాఖ మాత్రమే. త్వరలో తీవ్రమైన నిర్ణయాలను తీసుకోనున్నది మన యూనియన్. 8-7న జరిగే సెంట్రల్ సి.డబ్ల్యు.సి లో కఠినమైన నిర్ణయాలు తీసుకొని తపాళాశాఖ మెడలు వంచాలని మన యూనియన్ భావిస్తున్నది. కనుక కేంద్రనాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ నిరహారదీక్షలో పాల్గొని మెమోరాండంపై సంతకం చేసి తపాళాశాఖ కు మీ నిరసన తెలియజేస్తారని కోరుకుంటూ.....మీ KB. డియర్ జిడియస్ సోదర సోదరీమణులందరికి విజ్ఞప్తి మిత్రులారా మన కేంద్ర నాయకత్వం పోరాటపిలుపునిచ్చింది.ఏదిపోరాటం కమిటి అమలు ఎప్పుడు. ఆమరణనిరాహారదీక్షలు.ప్రాణత్యాగాలు. చేద్దాం అని. సరిగా పోరాటం చేయటం లేదని ,ఇంకా అనేకరకాలుగా అసహనం వ్యక్తం చేస్తున్న వారి కందరికి విజ్ఞప్తి.ఈపోరాటం మన కోసం మనఅందరికోసం 12/07/2017తేదిన డివిజన్ ఆఫీస్ వద్ద జరిగే నిరహారదీక్ష ను విజయవంతం చేయవలసివదిగా ప్రతిఒక్క జిడియస్ ను కోరుచున్నాము ఈధర్నా అత్యంత కీలకం.ఆమాటకొస్తే మన చేసే ప్రతిపోరాటం కీలకమే అందు లో ఇప్పుడు జరిగే నిరహారదీక్షలో డివిజన్ లో ఉన్న ప్రతివక్క 1100మంది GDS లుపాల్గొని మన అభిమతాన్ని మనఐక్యతను డిపార్టమెంట్ కు ప్రభుత్వానికి తెలియజేయవలసిన ఆవస్యకత ఉంది.ఇప్పుడు కూడా ఇంటిదగ్గరే పడుకుని వాళ్ళుఎవరో పోరాడుతారులే మనకుసాధించిపెడతారులే అని అనుకుంటే ఎవరూఏమిచేయలేరు.పోరాటంలో పాల్గొననివారికి ప్రశ్నించే హక్కేలేదు.నిర్ద్వందంగా చెపుతున్నాము.ప్రతిఒక్కజిడియస్ 1100మందికి1100మంది జిడియస్ లు ఈ నిరహారదీ లో పాల్గోనాలి నిరహారదీక్ష ను విజయవంతం చేయాలి ప్రతి కార్యకర్తకు విజ్ఞప్తి మనతోటి ప్రతిఒక్క జిడియస్ ను కూడా ఈ నిరాహారదీక్ష లో భాగస్వామ్యం చేయించండి. యన్.యస్.కుమార్.

No comments:

Post a Comment