Friday, 28 July 2017

ప్రియమైన జిడియస్ సోదర సోదరీమణులందరికి విజ్ఞప్తి
     సోదర,సోదరీమణులారా
                  మన ఆలిండియా గ్రామీణ తపాలసేవక్ సంఘం జిడియస్ ల అనేక సమస్యలను గుర్తించి,ఎప్పటినుండో అమలు కాని అనేక జిఓలను అకుంఠిత దీక్ష తో అమలు చేయించుకోవటానికి నిరంతరం ప్రయత్నిస్తున్నది.ఈ ప్రయత్నంలో చాలా వరకు మనంవిజయము సాదిస్తున్నాము. ఇంకా చాలామంది కి రీడిజిగ్నేషన్, రివిజన్ ఆఫ్ అలవెన్స్ జరగవలసియున్నది .అయితే ఈ సందర్భంగా మీ అందరికి ప్రత్యేకంగా ఒకవిజ్ఞప్తి చేస్తున్నాము మేము కూడా మీ అందరిలాగా జిడియస్ లమే ఒక్కక్క సందర్బంలో మేము కొన్ని కొన్ని కేసులలో మేము మొండిగా వ్వవహరించలేకపోవచ్చు.అంతమాత్రము చేత నిరాశావాదం తగదు.యుద్దంచేసేసైన్యాధిపతి తనను తాను రక్షించుకుంటూ తన సైన్యాన్ని తనరాజ్యాన్ని రక్షించాలి.నలువైపులా చుట్టుముటుతూ ముప్పేటలా దాడి చేస్తున్న కొంతమంది ఫెడరేషన్ ల నాయకులనుండి,ఎప్పటినుంచో పేరుకు పోయిన సమస్యలను పరిష్కరించటానికి విముఖత చూపిస్తున్న డిపార్టమెంట్ పెద్ద ల నుండి.అసలు తమకు ఈవిధముగా అన్న్యాయం జరిగినది అని ఇప్పటి వరకు తెలియకుండా తెలిసినవెంటనే పరిష్కారము కాలేదు అని జిడియస్ యూనియన్ చేయలేదు అని అపోహ తో ఉన్న జిడియస్ ల అమాయకత్వం ఇలా ముప్పేటదాడినుండి కాచుకోవాలసిన అవసరము ఉన్నది.అయితే ఈక్రమములో కొంతమంది అమాయక త్వంతో నిండిన జిడియస్ ల ను మరళా వలవేసి లోబరుచుకోవటానికి కొంతమంది కుట్ర చేస్తున్నారు.దానిని మావైఫల్యంగా చూపిస్తున్నారు.ఆత్నసాక్షిగా చెబుతున్నాము జిడియస్ ల సమస్య ల పరిష్కారాని కి అకుంఠిత దీక్ష తో పనిచేస్తాము.అంతేగాని కొంతమంది ఆరోపిస్తున్నట్లు 7,8వేలరూపాయలతో నిలకడలేని జీతాలతో భద్రతలేని ఉద్యోగాలతో చాలిచాలనిబతుకులుఈడుస్తున్న జిడియస్ ల చందాలకోసమో లేదా వారి వారి దుర్బర దారిద్ర్యాన్ని అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని మాఅవసరాలు గడుపుకోవాలనో లేదావారి రక్తమాంసాలతో మాఆకలితీర్చుకోవాలనోమేము యూనియన్ నడపటములేదు.మా ఈప్రయత్నములో కొన్ని కొన్ని సందర్బాలలో మేము సఫలం కాకపోవచ్చుఅంతమాత్రముచేతవిఫలముమాత్రము కాలేదు.ఘంటాపధంగా చెబుతున్నాము ఈరోజు జిడియస్ సగర్వంగా తలఎత్తుకుని నిలుచున్నాడు అంటే అది ఏఐజిడియస్ యూనియన్ పోరాటఫలితమే 20,30ఏళ్ళనుండి గుర్తుకు రాని సమస్య లు ఈరోజు జిడియస్ యూనియన్ పోరాటాల సందర్భం లో ఎందుకు గుర్తుకు వస్తున్నాయి.ఇది జిడియస్ యూనియన్ ఘనత కాదా.మావూరివాళ్ళు సార్ మా  SO  వాళ్ళుసార్ అని అధికారులునుఈరోజు ప్రాధేయపడేవాళ్ళు ఇన్నాళ్ళపాటు ఏమైపోయారో? అందుకే చెబుతున్నాము మేము నిజాయితీగా,నిష్కళంకంగా నిబద్దతో పనిచేస్తాము అంతేగాని ఎవరికోభయపడో రాగద్వేషాలకు , ప్రలోభాలకు లొంగిపోయో పనిచేయకుండాఉండము.నిరంతరం జిడియస్ ల హక్కుల సాధన కోసము.జిడియస్ ల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తామని , అలాగే మన జిడియస్ లు ఎవరూ కూడా ఎవరి ప్రలోభాలకు లొంగిపోయి ఇతరయూనియన్ లకు డిక్లరేషన్ లు ఇచ్చిజిడియస్ యూనియన్ వైభవాన్ని మసకబారచవద్దని మీ అందరికి ప్రత్యేకంగా శిరస్సువంచి విజ్ఞప్తి చేస్తున్నాము
    నమస్కారములతో
N.SREENIVASA KUMAR
 DN PRESEDENT
      AIGDSU. Prakasam dn

No comments:

Post a Comment