Friday 28 July 2017

AIGDSU PRAKASAM division general body meeting held on 2:30pm, 2-8-17 Wednesday,at Employees Union Office, 2nd floor ,RTC bus stand, Ongole, in presence of division president N.Srinivasa Kumar....          KB MEERAVALI,                                              Dn Secretary,                                    PRAKASAM division,                                Ongole.
ప్రియమైన జిడియస్ సోదర సోదరీమణులందరికి విజ్ఞప్తి
     సోదర,సోదరీమణులారా
                  మన ఆలిండియా గ్రామీణ తపాలసేవక్ సంఘం జిడియస్ ల అనేక సమస్యలను గుర్తించి,ఎప్పటినుండో అమలు కాని అనేక జిఓలను అకుంఠిత దీక్ష తో అమలు చేయించుకోవటానికి నిరంతరం ప్రయత్నిస్తున్నది.ఈ ప్రయత్నంలో చాలా వరకు మనంవిజయము సాదిస్తున్నాము. ఇంకా చాలామంది కి రీడిజిగ్నేషన్, రివిజన్ ఆఫ్ అలవెన్స్ జరగవలసియున్నది .అయితే ఈ సందర్భంగా మీ అందరికి ప్రత్యేకంగా ఒకవిజ్ఞప్తి చేస్తున్నాము మేము కూడా మీ అందరిలాగా జిడియస్ లమే ఒక్కక్క సందర్బంలో మేము కొన్ని కొన్ని కేసులలో మేము మొండిగా వ్వవహరించలేకపోవచ్చు.అంతమాత్రము చేత నిరాశావాదం తగదు.యుద్దంచేసేసైన్యాధిపతి తనను తాను రక్షించుకుంటూ తన సైన్యాన్ని తనరాజ్యాన్ని రక్షించాలి.నలువైపులా చుట్టుముటుతూ ముప్పేటలా దాడి చేస్తున్న కొంతమంది ఫెడరేషన్ ల నాయకులనుండి,ఎప్పటినుంచో పేరుకు పోయిన సమస్యలను పరిష్కరించటానికి విముఖత చూపిస్తున్న డిపార్టమెంట్ పెద్ద ల నుండి.అసలు తమకు ఈవిధముగా అన్న్యాయం జరిగినది అని ఇప్పటి వరకు తెలియకుండా తెలిసినవెంటనే పరిష్కారము కాలేదు అని జిడియస్ యూనియన్ చేయలేదు అని అపోహ తో ఉన్న జిడియస్ ల అమాయకత్వం ఇలా ముప్పేటదాడినుండి కాచుకోవాలసిన అవసరము ఉన్నది.అయితే ఈక్రమములో కొంతమంది అమాయక త్వంతో నిండిన జిడియస్ ల ను మరళా వలవేసి లోబరుచుకోవటానికి కొంతమంది కుట్ర చేస్తున్నారు.దానిని మావైఫల్యంగా చూపిస్తున్నారు.ఆత్నసాక్షిగా చెబుతున్నాము జిడియస్ ల సమస్య ల పరిష్కారాని కి అకుంఠిత దీక్ష తో పనిచేస్తాము.అంతేగాని కొంతమంది ఆరోపిస్తున్నట్లు 7,8వేలరూపాయలతో నిలకడలేని జీతాలతో భద్రతలేని ఉద్యోగాలతో చాలిచాలనిబతుకులుఈడుస్తున్న జిడియస్ ల చందాలకోసమో లేదా వారి వారి దుర్బర దారిద్ర్యాన్ని అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని మాఅవసరాలు గడుపుకోవాలనో లేదావారి రక్తమాంసాలతో మాఆకలితీర్చుకోవాలనోమేము యూనియన్ నడపటములేదు.మా ఈప్రయత్నములో కొన్ని కొన్ని సందర్బాలలో మేము సఫలం కాకపోవచ్చుఅంతమాత్రముచేతవిఫలముమాత్రము కాలేదు.ఘంటాపధంగా చెబుతున్నాము ఈరోజు జిడియస్ సగర్వంగా తలఎత్తుకుని నిలుచున్నాడు అంటే అది ఏఐజిడియస్ యూనియన్ పోరాటఫలితమే 20,30ఏళ్ళనుండి గుర్తుకు రాని సమస్య లు ఈరోజు జిడియస్ యూనియన్ పోరాటాల సందర్భం లో ఎందుకు గుర్తుకు వస్తున్నాయి.ఇది జిడియస్ యూనియన్ ఘనత కాదా.మావూరివాళ్ళు సార్ మా  SO  వాళ్ళుసార్ అని అధికారులునుఈరోజు ప్రాధేయపడేవాళ్ళు ఇన్నాళ్ళపాటు ఏమైపోయారో? అందుకే చెబుతున్నాము మేము నిజాయితీగా,నిష్కళంకంగా నిబద్దతో పనిచేస్తాము అంతేగాని ఎవరికోభయపడో రాగద్వేషాలకు , ప్రలోభాలకు లొంగిపోయో పనిచేయకుండాఉండము.నిరంతరం జిడియస్ ల హక్కుల సాధన కోసము.జిడియస్ ల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తామని , అలాగే మన జిడియస్ లు ఎవరూ కూడా ఎవరి ప్రలోభాలకు లొంగిపోయి ఇతరయూనియన్ లకు డిక్లరేషన్ లు ఇచ్చిజిడియస్ యూనియన్ వైభవాన్ని మసకబారచవద్దని మీ అందరికి ప్రత్యేకంగా శిరస్సువంచి విజ్ఞప్తి చేస్తున్నాము
    నమస్కారములతో
N.SREENIVASA KUMAR
 DN PRESEDENT
      AIGDSU. Prakasam dn

Sunday 23 July 2017

నర నరాల వేదనలో తర తరాల రోదనలో బక్క చిక్కి బిక్క చచ్చి పడిన బతుకు గోడలు! చూడు చూడు నీడలు! మన జి డి యెస్ ల బతుకులు! రాను రాను మన బ్రతుకులని రాజకీయం చేసే నాయకులని చూస్తుంటే బాధగా ఉంటుంది ! పేర్లకి ముందు ఫెడరేషన్ నాయకులం అని జిడియస్ ల కోసం పోరాడుతున్న ధీరులం - శూరులం అంటున్నారు కదా మరి జిడియస్ ల కు ఓక్క సారైనా న్యాయం చేశారా ? ఆత్మపరిశీలన చేసుకోండి.
Fedaration లలో  ఉండి డిపార్ట్మెంట్ సోదరుల అడుగులకు మడుగులు ఓత్తే గుర్తింపులేని అనుభంధ సంఘాల మిత్రులారా ! ఒక జిడియస్ గా ఉన్న మీరు జి డి యెస్ బ్రతుకులు మార్చగలమని చెప్పుకొనే మీరు మీ ఫెడరేషన్ నాయకులని ఎదురించి సమ్మే చేసే ధైర్యం వుందా ? లేదు.ఒక ధర్నా చేసే సత్తా కూడ లేని నాయకత్వం ఎందుకని ఎమోషన్స్ తో ఫీలవుతున్నారు ? ఒక gds మిత్రుడు వాదన ఇలా ఉంది అసలు ఏ యూనియన్ లో ఉంటే ఏంటి ఎవరేమి చెయ్యలేదు ఎవరికి మద్దతు ఇచ్చిన ఒరిగేదేముంది అని సోదరా ఒక్క మాట మీరు మన యూనియన్ నాయకుడు మన కోసం ఏ విధంగా పాటు పడుతున్నడో తెలుసుకోవాలి మనకి వచ్చిన పే కమిటీ రిపోర్ట్ నందు మన యూనియన్ నాయకులు మన బ్రతుకులు మార్చే విధంగా సానుకూల సిఫార్సులను అమలు చేయించేందుకు తగిన పోరాట కార్యక్రమాలు నిర్వహిస్తుంటే ఫెడరేషన్ యూనియన్ నాయకుల శ్రమ ఎలా ఉంది అంటే కమిటీ రిపోర్ట్ వచ్చిందే మా వల్లే అని మరోసారి అసత్య ప్రచారం చేస్తున్నారు.ఓక వేళ అదే నిజం అన్నప్పుడు మరెందుకు జీడియస్ ల కమీటి రిపోర్ట్ అమలుకై తదుపరి కార్యాచరణ రూపొందించట్లేదు ? అంటే జిడియస్ లు ఫెడరేషన్ల ల సంఖ్యా బలానికే తప్పితే మరెందుకు జిడియస్ లు అవసరం లేదన్న మాట.
మన AIGDSU నాయకులు కమిటీ రిపోర్ట్ నందలి సిఫార్సుల అమలు మీద నిమగ్నమై పోరాడుతుంటే ఓర్వలేని ఫెడరేషన్ లు ఇక మన ఆటలు సాగవు అని గగ్గోలు చెంది తన స్థాయి,హోదా లను మర్చి జిడియస్ ల చుట్టు ఎవరెన్ని ప్రదక్షిణలు చేసినా డివిజన్ లో 90% AIGDSU కే పట్టం కట్టడంతో కూడ ఫెడరేషన్ నాయకులకు నిద్రలు పట్టడం లేదు.
మన నాయకులు మహదేవయ్య గారు కుటుంబానికి దూరమైపోయి జి డి యెస్ బ్రతుకులు మార్చాలని పాటు పడుతుంటే ఫెడరేషన్ నాయకులేమో AC రూంలలో,విందు,విలాసాలతో  నిత్యం భోగ భాగ్యాలు పొందుతూ మన జి డి యెస్ లను ఏ విధంగా మభ్యపెట్టాలి ఏ విధంగా జిడియస్  యూనియన్ మీద బురద జల్లాలి, ఎలా అన్ని మనమే సాధించి పెట్టామని అసత్య ప్రచారం చేయాలి అని చూస్తున్నారు.ఇంకెన్నాళ్లు ఇలా ఫెడరేషన్లు  మభ్య పెట్టి అబద్ధపు ప్రకటనలతో, అసత్య ప్రచారాలతో బతుకుతారు ముందు జి డి యెస్ లకి పనికొచ్చే వాటి మీద పోరాటాలు చెయ్యండి మీకు దమ్ముంటే 8 గంటల పని కావాలని అబద్దపు కరపత్రాలతో మభ్యపెట్టి మోసం చేయడం కాదు. జిడియస్ లకు 8 గంటల పని 18000 జీతం కోసం నిరవధిక సమ్మె చేసే దమ్ము,ధైర్యం ఫెడరేషన్ నాయకులకు వుందా ? ఇలాంటి ఇది రెండు జిడియస్ యూనియన్ ఫెడరేషన్ ల  మధ్య ఉన్న తేడా.
ఒకరు కుటుంబాన్ని వదిలి మన కోసం అహర్నిశలు పోరాడి పాటు పడే నాయకుడు. మరోకరేమో మన విలాసాలతో జిడియస్ ల  బ్రతుకులు కంటే వారి బ్రతుకులు మాత్రమే మార్చుకునే నాయకుడు.
నిజంగా ఫెడరేషన్ నాయకులారా ! మీకు దమ్ముంటే జి డి యెస్ బ్రతుకులు మార్చేలా పోరాటాలు, నిరవధిక సమ్మెలు చెయ్యండి  .మేము ఫెడరేషన్లని నిదించటంలా ! కేవలం స్వార్ధ పూరితంగా జిడియస్ లను మోసం చేస్తున్న ఫెడరేషన్ నాయకులని మాత్రమే ప్రశ్నిస్తున్నాం ? ఇప్పటికైనా ఎవరు జి డి యెస్ ల కోసం పాటుపడుతున్నారో, మరి 160 సం" ల నుండి జిడీయస్ వ్యవస్థ కు ప్రధాన కారకులెవరో జిడియస్ మిత్రులందరూ అలోచించి - అర్థం చేసుకోగలరు.
అబద్దపు ప్రచారాలు,అసత్య ఆరోపణలతో జిడియస్ లను మభ్య పట్టే ఫెడరేషన్ లను నమ్మి ఎవ్వరూ మోసపోవద్దు.
ఒక్కసారి ఆలోచించండి.
జిడియస్ బతుకుల బాగు కోసం AIGDSU తప్ప ఎవరు పోరాడుతున్నారో గమనించండి.
Sayyad Meeravali gariki operation success gaa jariginadi, Meeravali Garu thvaraga kolukovalani division Union korukuntunnadi

Friday 21 July 2017

మొన్న యాక్సిడెంట్ జరిగిన ప్రకాశం డివిజన్ తాళ్లూరు యస్.ఒ. జి.డి.యస్.యం.డి. సయ్యద్ మీరావలి గారికి ఇంకా ఆపరేషన్ జరగలేదు, సి.యం. క్యాంప్ ఆఫీసునుండి లెటర్ తీసుకవచ్చిన కూడా అప్రోవల్ కాలేదని ఒంగోలు Aluri hospital varu ఆపరేషన్ చేయలేదు. ప్రస్తుతం మన పి.ఎ.పాడు యస్.ఒ లోని జి.డి.యస్.యంసి నోసిన వెంకటేష్ కుమారుడు N.Srini vasulu సి.యం గారి గన్ మెన్  , అతను ఇప్పుడు అప్రోవల్ ఇప్పించేపనిలో ఉన్నారు దాదాపు 10 గంటల 30 నిమిషాలకు అప్రోవల్ వస్తుంది తరువాత ఆపరేషన్ చేస్తారు , దగ్గరలో ఉన్నవారెవరైనా వెళ్లి చూసిరండి. వారికి ఎటువంటి అవసరమొచ్చిన మన యూనియన్ తరుపున సహాయం చేయుటకు సిధ్దంగా ఉన్నామని వారికి చెప్పాము. సయ్యద్ మీరావలి గారు త్వరగా కోలుకోవాలని మనతో సంతోషంగా జీవించాలని ఆత్మసాక్షిగా కోరుకుంటూ.....కె.బి.

Wednesday 19 July 2017

ప్రకాశం డివిజన్ అద్దంకి ఐ.పి.ఒ జి.డి.యస్ లపట్ల నిర్లక్ష వైఖరికి వ్యతిరేఖంగా 8-8-2017 ఒక్కరోజు ధర్నా చేయుటకు , డివిజన్ అధ్యక్షులు శ్రీనివాసకుమార్ అధ్యక్షతలో డివిజన్ కార్యదర్శి కె.బి.మీరావలి ధర్నా నోటీసు ఇచ్చారు, ఈ కార్యక్రమంలో డివిజన్ ట్రెజరర్ బసవయ్య మరియు డివిజన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు యూత్ సెక్రటరీ డి.మీరావలి కూడా ఉన్నారు....కె.బి


Add caption

Thursday 13 July 2017

Thursday, July 13, 2017 GDS committee report file sent to expenditure dept in the Finance Ministry today. Hon'ble MOC gave approval for GDS committee report file yesterday Department prepared note and sent to expenditure dept in the Finance Ministry today for approval After approval of finance ministry it will be sent to cabinet convey this message to all and requested to join in AIGDSU for betterment

Monday 10 July 2017


రేపు జరగబోయే మన జి.డి.యస్ నిరహారదీక్ష చాలా ఎఫెక్టివ్ గా చేయాలని కేంద్రసంఘం కోరుచున్నది. కేంద్రనాయకులు రేయింబవళ్లు ఢిల్లీలో కష్టపడుతుంటే కనీసం మనం మన డివిజన్ లో నిరాహారదీక్ష ఎలా తేయాలో అర్ధం చేసుకోండి, మేము ఒంగోలు నగరంలో మునుపెన్నడూ జరగనివిదంగా మరెవ్వరూ చేయనివిదంగా రేపటి కార్కక్రమం చేయాలనుకుంటున్నాం, ప్రతి డివిజన్ లో కూడా చాలా ఎఫెక్టివ్ నిరహారదీక్షను నిర్వహిస్తారని కోరుకుంటున్నాం. అలాగా మీరు నిరహారదీక్షకు వస్తూ కనీసం ఇద్దరిిని తీసుకరండి చాలు , ఉదయం 10గంటలకు దీక్షాశిబిరం వద్దకు వచ్చి దీక్షలో పాల్గొనాలి, దీక్షసమయం పూర్తయ్యంతవరకు దీక్షాశిబిరం నుండి బయటకు పోకూడదు, ఎటువంటి ఆహారం తీసుకోకూడదు .....కె.బి.
ఈ రోజు సాయంత్రం 5గంటలకు తపాలాశాఖ శాఖ అధికారులకు "సమ్మె" నోటీసును మన కేంద్ర నాయకులు అందజేశారు. తే16.08.2017 నుంచి సమ్మె మొదలవుతుంది. జీడీయస్ సోదరులు అందరూ పాల్గొనాలని కోరడమైనది.....KB

Friday 7 July 2017

GDS committee position All financial implications worked out and submitted to Ministry Of Communication for approval yesterday B V RAO, .....KB
Saturday, July 8, 2017 Com. D. Gnaniah Ex. Secretary General NFPTE, No More Com D. Gnaniah Ex. Secretary General NFPTE, No More. He was above 95 Years expired today at 0430 am on 08-072017 in hospital. Funeral will be held tomorrow at Coimbatorei on arrival of her Daughter from US. AIGDSU Express heartfelt Condolence to the Great Leader, General Secretary AIGDSU KB MEERAVALI ACS

Thursday 6 July 2017

మన డివిజన్ ప్రెసిడెంట్ గారు పోస్ట్ చేసినట్లుగా వాట్సప్ గ్రూప్ లో ఆవేదన వెళ్లబుచ్చేవారందరికి ఇది మంచి పోరాటసమయమనుకుంటా మరి మీ సత్తా తెలియజేయండి కామ్రేడ్స్ అప్పుడు మీరుపడే ఆవేదనకు ఒక అర్ధం వస్తుంది. మాటలు కాదు మిత్రమా పోరాటం చేయాలి. మేము 12 వ తారీఖున ఒక సంచలన నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాం అది ఎలా ఉండబోతుందంటే ఎవరూ చేయలేనిది , చేయటానికి సాహసించనది అదేంటో తెలుసుకోవాలంటే, ప్రత్యక్షంగా చూడాలంటే12 వ తారీఖున ఒంగోలులో జరిగే నిరహారదీక్షకు రండి అప్పటివరకు అది సస్పెన్స్...కె.బి.

KB Meeravali,ACS: కమిటీ రిపోర్ట్ అమలు విషయంలో తాత్సారం చేస్తున్న పోస్టల్ డిపార్ట్ మెంట్ , సెంట్రల్ యూనియన్ సీరియస్, 12-07 నిరహారదీక్ష ప్రోగ్రాం సిన్సియర్ గా , బాగా ఎఫెక్టివ్ గా చేయాలని యూనియన్ ఆదేశం, మన సత్తా ఏంటో తెలియజేసే టైమ్ ఆసన్నమైంది , మనకోసం ఎవరో ఒకరు పోరాటాలు చేస్తారనే విషయాన్ని విడనాడుదాం- పోరాటాలు చేసి నేనే సాధించాను అనే ఆలోచనకు వద్దాం. ఈ నిరహారదీక్షతో తిరుగుబాటు అంటే ఇలా ఉంటదా అని డిపార్ట్ మెంట్ కు తెలియాలి , ఈ విషయంలో ప్రభుత్వానిది ఎటువంటి తప్పులేదు, మనలని మోసం చేస్తున్నది తపాళాశాఖ మాత్రమే. త్వరలో తీవ్రమైన నిర్ణయాలను తీసుకోనున్నది మన యూనియన్. 8-7న జరిగే సెంట్రల్ సి.డబ్ల్యు.సి లో కఠినమైన నిర్ణయాలు తీసుకొని తపాళాశాఖ మెడలు వంచాలని మన యూనియన్ భావిస్తున్నది. కనుక కేంద్రనాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ నిరహారదీక్షలో పాల్గొని మెమోరాండంపై సంతకం చేసి తపాళాశాఖ కు మీ నిరసన తెలియజేస్తారని కోరుకుంటూ.....మీ KB. డియర్ జిడియస్ సోదర సోదరీమణులందరికి విజ్ఞప్తి మిత్రులారా మన కేంద్ర నాయకత్వం పోరాటపిలుపునిచ్చింది.ఏదిపోరాటం కమిటి అమలు ఎప్పుడు. ఆమరణనిరాహారదీక్షలు.ప్రాణత్యాగాలు. చేద్దాం అని. సరిగా పోరాటం చేయటం లేదని ,ఇంకా అనేకరకాలుగా అసహనం వ్యక్తం చేస్తున్న వారి కందరికి విజ్ఞప్తి.ఈపోరాటం మన కోసం మనఅందరికోసం 12/07/2017తేదిన డివిజన్ ఆఫీస్ వద్ద జరిగే నిరహారదీక్ష ను విజయవంతం చేయవలసివదిగా ప్రతిఒక్క జిడియస్ ను కోరుచున్నాము ఈధర్నా అత్యంత కీలకం.ఆమాటకొస్తే మన చేసే ప్రతిపోరాటం కీలకమే అందు లో ఇప్పుడు జరిగే నిరహారదీక్షలో డివిజన్ లో ఉన్న ప్రతివక్క 1100మంది GDS లుపాల్గొని మన అభిమతాన్ని మనఐక్యతను డిపార్టమెంట్ కు ప్రభుత్వానికి తెలియజేయవలసిన ఆవస్యకత ఉంది.ఇప్పుడు కూడా ఇంటిదగ్గరే పడుకుని వాళ్ళుఎవరో పోరాడుతారులే మనకుసాధించిపెడతారులే అని అనుకుంటే ఎవరూఏమిచేయలేరు.పోరాటంలో పాల్గొననివారికి ప్రశ్నించే హక్కేలేదు.నిర్ద్వందంగా చెపుతున్నాము.ప్రతిఒక్కజిడియస్ 1100మందికి1100మంది జిడియస్ లు ఈ నిరహారదీ లో పాల్గోనాలి నిరహారదీక్ష ను విజయవంతం చేయాలి ప్రతి కార్యకర్తకు విజ్ఞప్తి మనతోటి ప్రతిఒక్క జిడియస్ ను కూడా ఈ నిరాహారదీక్ష లో భాగస్వామ్యం చేయించండి. యన్.యస్.కుమార్.