Sunday, 14 August 2016

Tuesday, 9 August 2016

ప్రజా సాదికారిక సర్వే (పల్స్ సర్వేటజ) జరుగుచున్నది మనం ఎవరమి అనే విషయం సర్వేలో ఎక్కించుటకు వారికిచ్చిన టాబ్ లో ఆప్షన్ లేదు,ప్రభుత్వ ఉద్యోగులమని ఎక్కిస్తే ప్రభుత్వం నుండి మనకొస్తున్న చిన్నచిన్న రాయితీలు పోతయని మనం ప్రభుత్వ ఉద్యోగులం కాదని ఒక సర్టిఫికేట్ ఇవ్వమని మన యస్.యస్.పి. గారిని కోరియున్నాము.అందరికీ ఒకే సర్టిఫికేట్ ఇవ్వకూడదు ఎంతమంది అప్లయ్ చేసుకుంటారో వారందరికి వారి పేరుతో సర్టిఫికేట్స్ తయారుచేయుంచి త్వరగా పంపించే ఏర్పాటు చేయిస్తానని హామి ఇచ్చారు.కనుక కావలసిన వారు యస్.యస్.పి. గారికి ఒక లెటర్ పెట్టండి మరిన్ని వివరాలకు కాల్ చేయండి. పోరాటాభినందనలతో    ...........  మీ కె.బి.మీరావలి,కార్యదర్శి.
ప్రభుత్వం చేపడుతున్న ప్రజా మరియు కార్మిక వ్యతిరేఖ విధానాలకు వ్యతిరేఖంగా జరగబోవు సెప్టంబర్ 2 ఒక్కరోజు సమ్మెకు మన యూనియన్ కేంద్ర నాయకత్వం మద్దతు తెలుపుతూ సమ్మె చేయుటకు నిర్ణయించింది.ప్రతి ఒక్కరం  సెప్టంబర్ 2 వ తారీకు ఒక్కరోజు సమ్మె చేద్దాం.......కె.బి.మీరావలి,రాష్ట్ర సహాయ కార్యదర్శి.

Wednesday, 3 August 2016

మరోకసారి తెలియజేయటం ఏమనగా సెప్టెంబర్ 17,18,19 తారీకులలో బెంగుళూరు కి దగ్గరలో మన యూనియన్ ఆలిండియా కాన్ఫరెన్స్ జరుగును.ఆసక్తి ఉండి మహాసభలకు రావాలనుకునే వారెవురైనా రైలు రిజర్వేషన్ చేయుంచుకోగలరు.డెలిగేషన్ ఫీజు ఉంటుంది. ....... KB MEERAVALI, Asst Circle Secretary

నిన్న 2-8-2016 సాయంత్రం 5-00 గంటలకు  హైదరాబాద్ లోని సి.పి.యం.జి. ఆఫీసులో జి.డి.యస్ కమిటీ శ్రీ కమలేష్ చంద్ర కమిటీతో మన యూనియన్ నాయకులు సర్కిల్ కార్యదర్శి కామ్రేడ్  బి.వి.రావు గారు,సర్కిల్ ప్రెసిడెంట్ బి.జయరాజు గారు, సర్కిల్ సహాయ కార్యదర్శులు మసూద్ హుస్సేన్ గారు, వై.మర్రెడ్డి గారు మీటింగ్ లో పాల్గొన్నారు.ప్రతి జి.డి.యస్.కు 8-00గంటలు పని కల్పించి 8-00 గంటలుకు సరిపడ జీతం ఇవ్వాలని,జి.డి.యస్ లను రెగ్యులర్ చేసి రెగ్యులర్ ఉద్యోగులకిస్తున్న అన్ని సదుపాయాలు కల్పించాలని గట్టిగా డిమాండ్ చేశారు. జి.డి.యస్ లకు సరైన న్యాయం చేస్తామని కమిటీ వారు గట్టినమ్మకం ఇచ్చారు. తర్వాత మన నాయకులు కమిటీ ఛైర్మన్,సెక్రటరీని దుశ్శాలువలుతో సన్మానించారు...... కె.బి.మీరావలి,రాష్ట్ర సహాయ కార్యదర్శి.