Wednesday, 5 July 2017

పదవీ విరమణ చేసిన పామూరు యస్.ఒ బుక్కాపురం జి.డి.యస్ యం.డి. ష్క్ చినమౌలాలి గారికి డివిజన్ యూనియన్ తరుపున పదవీ విరమణ శుభాకాంక్షలు ... KB Meeravali,ACS: అంగరంగ వైభవంగా జరుగుచున్న మౌలాలి గారి పదవీవీరమణ ఫంక్షన్....కె.బి

Tuesday, 4 July 2017


కావలి లో కాళిదాసు కళాసాధన సమితి ఆధ్వర్యంలో గతనెల 21 నుండి 25 తారీఖులలో నాటకపోటీలు జరిగినవి. ఈ నాటకపోటీలలో ''దండోరా'' నాటకానికి మేకప్ వేసిన మన AIGDSU ప్రకాశం డివిజన్ సీనియర్ నాయకులు, పోకూరు యస్.ఒ జి.డి.యస్ ప్యాకర్ కామ్రేడ్ యం.ఆర్.యస్. దాస్ గారికి జాతీయస్థాయి ఉత్తమ మేకప్ మ్యాన్ అవార్డ్ వచ్చింది. దాస్ గారికి యూనియన్ తరుపున మరియు జిడియస్ తరుపున ప్రత్యేక అభినందన మందారమాలలు, మన జి.డి.యస్ ఇలాంటి పురస్కారం తీసుకోవటం మనకెంతో గర్వకారణం, వారిని త్వరలో సన్మానించుకుందాం....కె.బి.

Monday, 3 July 2017

ఈరోజు ప్రకాశం డివిజన్ కనిగిరి యస్.ఒ పరిధిలో కంచర్లవారిపల్లి బి.ఒ. లో ఈమధ్యకాలంలో అంటే జూన్ 14తారీఖున పదవీ విరమణ చేసిన కలగట్ల బి.పి.యం డి.యల్. నరసింహీరావు మరియు జూన్ 30న పదవీవిరమణ చేసిన మార్కొండాపురం బి.ఒ లో జి.డి.యస్.యం.సి/యం.డి బక్కా దేవసహాయం గార్లకు AIGDSU నాయకులు లెక్కల వెంకటేశ్వర్లు , షేక్ నాయబ్ రసూల్, పెన్నా రమణయ్య, పి.వి.కొండయ్య గార్ల ఆధ్వర్యంలో రాష్ట్ర సహాయకార్యదర్శి కె.బి.మీరావలి అధ్యక్షతన కనిగిరి సబ్ డివిజన్ ఎ.యస్.పి షేక్ అహ్మద్ ఆలీ గారు ముఖ్యఅతిధిగా , కనిగిరి యస్.పి.యం జి.వెంకటేశ్వర్లు గారు గౌరవధ్యక్షులుగా ఘనసన్మానం జరిగింది. ఈకార్యక్రమానికి మన యూనియన్ డివిజన్ ఉపాధ్యక్షులు కుందురు రమణారెడ్డి,కృష్ణారెడ్డి,గిరిబాబు, ప్రసాద్,శ్రీరాములు,శ్రీను,మెయిల్ ఓవర్సీలు బాలచెన్నయ్య,నవీన్,సాల్మన్ రాజు ,యస్.పి.యం లు నబీ ఉస్సేన్,శ్రీకాంత్ రెడ్డి, రమణమూర్తి, సోదరీమణులు మమూణా గారు, రవణమ్మ, షబనా ,లక్ష్మి , ఈశ్వరమ్మ తదితరులు దాదాపు 65 మంది పాల్గొని విజయవంతం చేశారు, ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లుగా కార్యక్రమం నిర్వహకులు తెలియజేశారు....కె.బి.