జి.డి.యస్ పేకమిటీ సిఫార్సులను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ AIGDSU పోరాట కార్యక్రమాలు... (1) ది 19-02-18 సోమవారం నుండి ది 24-2-18 శనివారం వరకు జి.డి.యస్ లందరూ నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన తెలియజేయాలి. (2). ది. 15-03-2018 గురువారం న్యూఢిల్లీ లో ప్రధాన మంత్రి నివాసం వద్ద 10 వేలమంది జి.డి.యస్ ఉధ్యోగులతో మాస్ ధర్నా నిర్వహించబడుతుంది. జి.డి.యస్ కమిటీ రిపోర్ట్ ను అమలు చేయటంలో తపాలాశాఖ చూపుతున్న నిర్లక్షంతో 2 లక్షల 70వేలు మంది జి.డి.యస్ ఉద్యోగులు విసిగి పోయారు. జి.డి.యస్ ల సహనాన్ని తపాలాశాఖ ఎంతకాలం పరీక్షించదలుచుకుందో మనకు తెలియదు. జి.డి.యస్ కమిటీ రిపోర్ట్ అమలు చేయడంలో జరుగుతున్న తీవ్రమైన ఆలస్యంతో జి.డి.యస్ ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. జి.డి.యస్ ల అసంతృప్తి, నిరసన, కోపం పరిగణనలోకి తీసుకోని AIGDSU పై పోరాటకార్యక్రమాన్ని రూపొందించింది. జి.డి.యస్ కమిటీ సిఫార్సులు వెంటనే అమలు చేయాలని AIGDSU డిమాండ్ చేస్తుంది. పోరాటాభినందనలతో...... బి.వి.రావు MA(Litt) కేంద్ర సంఘ సహాయ ప్రధాన కార్యదర్శి మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి, AIGDSU.