Monday, 12 February 2018
Wednesday, 31 January 2018
Sunday, 26 November 2017
24-11-17 న మధ్యాహ్నం 2-30 నుండి 3-30 వరకు ప్రకాశం డివిజన్ ఆఫీసు నందు గౌరవ యస్.యస్.పి గారితో ఎ.ఐ.జి.డి.యస్.యు కుజరిగిన మంత్లీమినిట్స్ వివరాలు. అఫిసియల్ సైడ్ గౌరవ యస్.యస్.పి టి.ఎ.వి శర్మ గారు, ఓ.యస్ మారుతి మధువాణి గారు, ఎ.యస్.పి .ఆర్ మురళీ కుమార్ గారు, ఐ.పి.ఒ కృష్ణ గారు పాల్గొన్నారు, యూనియన్ సైడ్ డివిజన్ కార్యదర్శి కె.బి. , డివిజన్ ఉపాధ్యక్షులు యస్.పూర్ణ చంద్రరావు గారు, యూత్ కార్యదర్శి మరియు నిర్మాణ కార్యదర్శి డి.మీరావలి పాల్గొన్నారు. పి.యల్.ఐ మరియు ఆర్.పి.యల్.ఐ ఇన్సెంటివ్ గురించి చర్చించాము , అప్లయ్ చేసిన ప్రతి ఒక్కరికి వెంటనే శాంక్షన్ చేస్తామన్నారు. 2. యం.జి.యన్ ఆర్.ఇ.జి.ఇ.యస్ ఇన్సెంటివ్ గూర్చి అడగగా అది మాపరిధిలో లేదని మీ సర్కిల్ యూనియన్ ద్వారా సర్కిల్ లెవల్ లో డీల్ చేయండని చెప్పారు.3. రిటైర్ అయిన జి.డి.యస్ లకు రావాలసిన సెవరెన్స్ అమౌంట్ మరియు యస్.డి.బి.యస్ పెన్షన్ గురించి చర్చించాము 40 కేసులకు గాను 18 మందికి సెవరెన్స్ అమౌంట్ ఇచ్చాము మిగతా వారికి కూడా ఆర్.ఒ నుండి లెటర్ రాగానే చెల్లిస్తామని చెప్పారు, అలాగే పెన్షన్ విదానం ఏ డివిజన్ లో కూడా మొదలుకాలేదని ఆర్డర్స్ రాగానే ఇస్తామని చెప్పారు. మన డివిజన్ నుండి సర్కిల్ ఆఫీసుకు లెటర్ రాస్తామని హామీ ఇచ్చారు. పెండింగ్ లో ఉన్న జి.డి.యస్ ల పేరివిజన్ వెంటనే చేయాలని మేము డిమాండ్ చేయటం జరిగింది, మన యూనియన్ తరుపున పంపినవి దాదాపుగా క్లియర్ చేసామని జి.డి.యస్ యం.డి, మారెల్ల, పి.సి.పల్లి యస్.ఒ, కు ఈ మధ్యకాలంలోనే హై స్కేల్ చేసామని చెప్పారు, పెండింగ్ లో ఉన్న తాళ్లూరు ప్యాకర్, జి.డి.యస్ యం.యసి/ యం.డి, కంకణంపాడు బి.ఒ, వెలిగండ్ల యస్.ఒ, జి.డి.యస్.యం.సి/యం.డి, యనమదల బి.ఒ, మార్టూర్ యస్ ఓ ఇవి మూడు ఈనెలాఖరుకు చేస్తామని గట్టిగా మాటిచ్చారు. అలాగే రావినూతల జి.డి.యస్.యండి మరియు టి.కొప్పెరపాడు బి.ఒ జి.డి.యస్.యంసి/యం.డి కి పేరివిజన్ డిసెంబర్ పస్ట్ వారంలో చేస్తామని చెప్పారు. చీరాల సబ్ డివిజన్ లో ఆర్.ఐ .సి.టి ట్రైనింగ్ కు వచ్చిన వారికి టి.ఎ ఇవ్వలేదని చెప్పాము , మా ఎదుటే చీరాల ఎ.యస్.పి గారితో మాట్లాడారు చీరాల సబ్ డివిజన్ బి.పి.యం లు ఎ.సి.జి-17 లో సంతకం చేసి , మీ యస్.పి.యం తో ఒకమాట చెప్పి మీ బి.ఒ లోనే తీసుకోండి. అలాగే కొమ్మాలపాడు జి.డి.యస్ ప్యాకర్ మూడు డ్యూటీలు అనైధరైజ్ డు గా చేస్తున్నారని అక్కడ మరొకరిని నియమించాలని గట్టిగా డిమాండ్ చేశాము, అద్దంకి ఐ.పి గారితోపోన్ లో మాట్లాడి ఈసమస్యను వెంటనే పరిష్కరించాలని ఆర్డర్ వేశారు, అలాగే కొనకనమిట్ల, గొట్లగట్టు మరియు తెల్లపాడు యస్ .ఒ లలో ప్యాకర్స్ మూడు డ్యూటీలు చేస్తున్నారని అక్కడ జి.డి.యస్.యం.డి లను నియమించాలని డిమాండ్ చేశాము , ఈ సమస్యపై పూర్తి
విషయాలు సేకరించి అతి త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు. డివిజన్ అధ్యక్షులు కామ్రేడ్ శ్రీనివాస్ కుమార్ గారు అర్జంట్ పని వలన ఈ మినిట్స్ కు రాలేక పోయారు.అలాగే మనప్రకాశం డివిజన్ యూనియన్ రిప్రజెంటేషన్ తో దాదాపుగా 100 మంది పైచిలుకు జి.డి.యస్ యం.డి, యం.సి,ప్యాకర్ లకు పేరివిజన్ మరియు 60 మంది పై చిలుకు జి.డి.యస్ యం.సి/ యం.డి లకు రీ డిజిగ్నేషన్ వలన జి.డి.యస్ యం.డి/ యం.సి లు గా మారి లాభపడ్డారని మంత్లీ మినిట్స్ లో అధికారులు తెలియజేశారు. ఈ పేరివిజన్ కు, రీడిజిగ్నేషన్ కు సహకరించిన డిపార్ట్ మెంట్ ఉద్యోగులకు, అధికారులకు, అలాగే సమస్యలను యూనియన్ దృష్ఠికు తీసుకవస్తున్న డివిజన్ యూనియన్ లీడర్స్ అందరికి ప్రత్యేక ధన్యవాదములు...... కె.బి, డివిజన్ కార్యదర్శి, ప్రకాశండివిజన్.
విషయాలు సేకరించి అతి త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు. డివిజన్ అధ్యక్షులు కామ్రేడ్ శ్రీనివాస్ కుమార్ గారు అర్జంట్ పని వలన ఈ మినిట్స్ కు రాలేక పోయారు.అలాగే మనప్రకాశం డివిజన్ యూనియన్ రిప్రజెంటేషన్ తో దాదాపుగా 100 మంది పైచిలుకు జి.డి.యస్ యం.డి, యం.సి,ప్యాకర్ లకు పేరివిజన్ మరియు 60 మంది పై చిలుకు జి.డి.యస్ యం.సి/ యం.డి లకు రీ డిజిగ్నేషన్ వలన జి.డి.యస్ యం.డి/ యం.సి లు గా మారి లాభపడ్డారని మంత్లీ మినిట్స్ లో అధికారులు తెలియజేశారు. ఈ పేరివిజన్ కు, రీడిజిగ్నేషన్ కు సహకరించిన డిపార్ట్ మెంట్ ఉద్యోగులకు, అధికారులకు, అలాగే సమస్యలను యూనియన్ దృష్ఠికు తీసుకవస్తున్న డివిజన్ యూనియన్ లీడర్స్ అందరికి ప్రత్యేక ధన్యవాదములు...... కె.బి, డివిజన్ కార్యదర్శి, ప్రకాశండివిజన్.
Tuesday, 22 August 2017
కామ్రేడ్స్, అసలేమి జరిగింది ఎందువలన సమ్మె ఆపవలసి వచ్చింది, సమ్మె వలన మనకొచ్చిన ప్రతి ఫలమేంటి అని అనేక ప్రశ్నలు మనలో తలెత్తుతున్నవి, ఒక వైపు నాయకులపై కోపం మరో వైపు ఎందుకొచ్చామా ఈ ఉద్యోగంలోకి మనస్సులో బాధ... అన్ని విషయాలకు ఈ కొంచెం చదవండి....15-08-2017 లోపు కమిటీ రిపోర్ట్ అమలు చేయకుంటే 16 నుండి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని నెలన్నర ముందుగా యూనియన్ హెచ్చరికలు చేసిన సంగతి తెలిసినదే, తర్వాత కమ్యూనికేషన్ మంత్రిగారు స్వయంగా మన డి.జి.ఆఫీస్ కు వచ్చి మన ఫైలును తపాలాశాఖ నుండి క్లియర్ చేయించారు దీనిలో విషేశమేంటంటే మనకోసం మన రిపోర్ట్ కోసం డి.జి.ఆఫీస్ శని,ఆదివారం కూడా పనిచేసింది ఇది మన యూనియన్ గొప్పతనం కాదా? తర్వాత ఫైలును పైనాన్స్ మినిష్టర్ ఆఫీసుకు పంపించడం అక్కడ ఇప్పటకి క్లియర్ కాకపోవటం మనకందరికీ తెలిసిన విషయమే, ఈతరుణంలో మనం ఇచ్చిన హెచ్చరికలు ప్రకారం సమ్మెకు సన్నద్దమైన టైమ్ లో పోస్టల్ కార్యదర్శి గారు మన నాయకులను 14వతారీఖున చర్చలకు పిలవటం చర్చలలో 2లేదా3 రోజులలో ఫైలు క్లియర్ చేపిస్తానని మాటిచ్చారు అయినాకూడా మన యూనియన్ నమ్మక సమ్మెలోకి వెళ్లుటకు నిశ్చయించుకొని సమ్మెలోకి దిగాం. తర్వాత మూడుదఫాలు చర్చలు జరిగినవి, చర్చలు అసంపూర్ణంగా ముగిసిన సంగతి అందరకీ తెలిసినదే, తర్వాత మంత్రిగారు ఈవిషయంలో ఇన్వాల్వ్ అయ్యి సమ్మె మానుకోని వస్తేగాని మీతో చర్చలు జరపమని ఖరాఖండిగా అల్టిమేటమ్ జారీ చేశారు అయినాకూడా మన యూనియన్ లెక్కచేయలేదు ఎన్ని రోజులైనా సమ్మె చేయుటకే సిధ్దమైంది అదేవిదంగా సమ్మెను కొనసాగిస్తున్నది, ఈ తరుణంలో నిన్న వెల్ఫేర్ కమిటీ మీటింగ్ జరిగినది ఈ కమిటీలో యన్.యఫ్.పి.ఇ, యఫ్.యన్.పి.ఒ, బి.యం.యస్, యస్.యసి. యస్.టి అసోషియేశన్ మరియు ఎ.ఐ.జి.డి.యస్.యు పాల్గొనాలి, ఈ మీటింగ్ కు మంత్రిగారు అధ్యక్షత వహిస్తారు, మన యూనియన్ ను తప్ప అన్ని యూనియన్ లను ఈ మీటింగ్ కు పిలిచారు, సమ్మె మానుకోని మీరు కూడా మీటింగ్ కు రమ్మన్నారు, కానీ మన యూనియన్ ,సమ్మె చేయుటకే ప్రాధాన్యతను ఇచ్చింది. మధ్యాహ్నం 1 గంటకు మీటింగ్ అయిపోయింది మంత్రిగారు వెళ్లిపోయారు. తర్వాత పోస్టల్ కార్యదర్శిగారు సెలవులో ఉండుటవలన డి.జి.గారికి పోన్ చేసి మరొక్కసారి మన యూనియన్ తో చర్చలు జరపమని ఆదేశించారు, నిన్న సాయంత్రం 5-30 కు మరలా డి.జి.ఆఫీసులో చర్చలు మరలా చర్చలు పెయిల్. తర్వాత మినిష్టర్ చాంబర్ నుండి మన యూనియన్ కు 7-00 గంటలకు పోన్ వచ్చింది, ఒక్కసారి చాంబర్ కు రమ్మన్నారు . మన నాయకులు మినిష్టర్ చాంబర్ కు వెళ్లారు, తపాలాశాఖ తరుపున ఒకరిని పిలిచారు , తపాలాశాఖ తరుపున శైలేంద్ర దశోరా, డి.డి.జి. యస్.ఆర్ లీగల్ హాజరయ్యారు. మినిష్టర్ చాంబర్ లో మినిష్టర్ ఆఫీసు అధికారులు మరియు మినిష్టర్ పి.ఎ , మన యూనియన్ నాయకులు మరియు డి.డి.జి గారు చర్చలకు కూర్చున్నారు. ఇప్పటికే ఐదుసార్లు చర్చలు జరిగినవి ఎందుకు చర్చలు విఫలమవుతున్నవని పి.ఎ లేవనెత్తాడు, అసలు మీరేమి అడుగుతున్నారు వాళ్లేమి చెబుతున్నారని అడిగారు. దానికి మన యూనియన్ నాయకులు 1 . డిమాండ్ గురించి చెబుతూ మాకు ఒక తారీఖులోపు ఇంప్లిమెంట్ చేస్తామని ఎస్యూరెన్స్ తోకూడినా అగ్రిమెంట్ ఇవ్వండని మేము అడుగుతున్నాం డిపార్ట్ మెంట్ ఇవ్వటంలేదని మన నాయకులు చెప్పారు, మినిష్టర్ ఆదేషాలనుసారం మినిష్టర్ పి.ఎ గారు కల్పించుకొని వారంరోజులలోపే ఫైలును క్లియర్ చేయిస్తానని మినిష్టర్ గారు చెప్పారు అని చెప్పారు , తర్వాత మన యూనియన్ నాయకులు కమిటీ రిపోర్ట్ పైనాన్స్ లో క్లియర్ అయినవెంటనే త్వరగా ఇంప్లిమెంట్ చేయాని డిమాండ్ చేసింది, దానికి పి. ఎ గారు ఎటువంటి ఆలస్యం జరగకుండా చూసుకునే బాధ్యతమాది అని హామీ ఇచ్చారు, తర్వాత తపాలాశాఖ కమిటీ రిపోర్ట్ ను తారుమారు చేసి పైలు తయారుచేసిందనేది మా అనుమానం దానిని యాజిటీజ్ గా ఇంప్లిమెంట్ చేయకుండా మా యూనియన్ తో సంప్రదింపులు జరిపిన తర్వాతే పైనల్ చేయాలని డిమాండ్ చేసింది, దానికి ఒప్పుతుంటూ మనకు అగ్రిమెంట్ ను మినిష్టర్ ఆఫీసు అధికారులు వారి చాంబర్ లో ఇప్పించటం మన సమ్మె ప్రభావమే, ఇదివరకెన్నడూ మినిష్టర్ చాంబర్ లో చర్చలు జరగలేదు ఈ సమ్మె ప్రభావం అటువంటిది, తపాలాశాఖ ను దాటి ప్రభుత్వం దృష్టికి మన సమస్య వెళ్లింది, ఇది ఒక గొప్ప అచీవ్ మెంట్, 2. రెగ్యులరైజేషన్ డిమాండ్ పై సుదీర్ఘంగా చర్చ జరిగింది, క్రొత్త క్రొత్త పథకాలు ప్రవేశపెడుతున్నాం అవి పూర్తిగా ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఈ డిమాండ్ గురించి ఆలోచిస్తామని చెప్పారు, మూడవ డిమాండ్ అయిన పెన్షన్ గురించి అది హైకోర్టులో ఉంది మీకు అనుకూలంగా తీర్పు వస్తే పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు,నాల్గవ డిమాండ్ గురించి ముందుగానే లెటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే, ఇదివరకెప్పుడూ మినిష్టర్ చాంబర్ లో చర్చలు జరగలేదు ఇప్పుడు మాత్రమే జరిగినవి అంటే మనం తపాలాశాఖ దాటి ప్రభుత్వం దృష్టిలో పడ్డాము, ఈ సమ్మె ప్రభావం ఖచ్చితంగా ప్రజలపై, ప్రభుత్వంపై పడిందనేది అక్షరసత్యం. ఇది అందరి ఐక్యత వలన సాధ్యపడింది, విషయాన్ని మంచి మనస్సుతో అర్ధం చేసుకుంటారని కోరుకుంటూ , మనం ఒక్కసారి నిరవధికసమ్మె చేస్తే రెగ్యులర్ అయిపోతామని కొంతమంది కుర్రాళ్లు భావిస్తున్నారు, ఇలాంటి పోరాటాలి మరెన్నో చేయాలసి వస్తుంది అన్నింటికీ సిధ్దమై ఉండాలి అంతేకానీ తొందరపడటం మంచిదికాదు, మేము కూడా ఎన్నో ఆశలతో ఈ శాఖలో అడుగుపెట్టాం కానీ, మీకు ఇంకా భవిష్యత్ ఉంది,వయస్సు ఉంది వేరే ఏదైనా సాధించవచ్చు కానీ మా పరిస్థితి , మేము మా కుటుంబాలు దీనినే నమ్ముకున్నాం ఏదైతేనేమి ఈ రోజు మనం జి.డి.యస్ ఏంటో నిరూపించాం మన సమ్మె దెబ్బేంటో ప్రభుత్వానికి చూపించాం, ఇదే కొనసాగితే మనగోల్ నెరవేరినట్లే......కె.బి
Tuesday, 15 August 2017
Subscribe to:
Posts (Atom)








