Tuesday 31 July 2018

Respected
  Freinds
 ఈ రోజు ఢిల్లీ డైరెక్ట్ రేట్ లో AIGDSU ,NUGDS,AIPEU (GDS)  JAC మరియు తపాలా శాఖ అధికారులు మధ్య  చర్చలు జరిగాయి.
ఈ చర్చలలో GDS JAC తరుపున ముగ్గురు జనరల్ సెక్రటరీ లు కమలేష్ చంద్ర కమిటి రిపోర్ట్ ఇంప్లిమెంటేషన్ లో మనకు జరిగిన అన్యాయాన్ని 1/1/2016 నుండి ఇంప్లిమెంట్ చేయనందున కలిగిన నష్టాన్ని వివరించారు .అయినా తపాలా శాఖ అధికారులు ఆ విషయము పై ఏమి చేయలేము కాబినేట్ నిర్ణయం అయిపోయింది దానిని రీ ఓపెన్ చేయటం కుదరుదు అనిశెలవిచ్చారు కామందులవారు.మిగిలిన విషయాలు అంటే లీవులు,ట్రాన్సఫర్స్, ఫైనాన్షియల్ అప్ గ్రేడషన్, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్సులు  ,ESI, ,తదితర డిమాండ్లు చూద్దాం సానుకూలముగా పరిశీలిస్తాం అంటున్నారు.ఈరోజు ఇచ్చినట్లుగానే ఇంకోనోట్ ఇవ్వమని ఉచిత సలహా ఒకటి పారేశారుఈ చర్చల విషయంలో ఎలాంటి మినిట్స్ డిపార్ట్మెంట్ రికార్డ్ చేయలేదని తెలుస్తున్నది.అలా మినిట్స్ రికార్డ్ చేయకపోతే ఎలాంటి ప్రాధాన్యతా ఉండని చర్చలు గా మిగిలిపోతాయి.ఈ విషయము పై సర్కిల్ యూనియన్ తో మాట్లడటము జరిగింది.ఇది పూర్తిగా జిడియస్ లు అంగీకరించటములేదు అని చెప్పాము. సర్కిల్ సెక్రటరీ గారు కూడా వెంటనే స్పందించి తక్షణమే మన సర్కిల్ వైపునుండి GDSJAC పై వెంటనే సమ్మె నోటీస్ ఇవ్వాలని JAC పై వత్తిడి తెస్తామని అన్నారు రేపు లేదా మరుసటి రోజు లెటర్ తయారు చేసి అందరికి (GDS)  పంపిస్తామని చెప్పారు .ఈలోపు ప్రతి GDS openion తీసుకోమని తెలిపారు.అసంపూర్తిగా ఉన్న సమస్యలపై వెంటనే పరిష్కరించాలి అలాచేయనిఎడల GDSJAC గా వెంటనే స్పందించి సమ్మె నోటీస్ ఇవ్వాలని సమ్మె లోకి వెళ్ళాలని GDS JAC ను డిమాండ్ చేయనున్నారు అలా JAC స్పందించని ఎడల AIGDSU  SINGLE గా నైనా సమ్మె లోకి వెళ్ళాలి అని డిమాండ్ చేయనున్నారు నేను కూడా ఇదే అభిప్రాయం తెలియజేశాను. సో ఫ్రెండ్స్ మీ ఒపీనియన్ కూడా తెలియజేయవలసినదిగా కోరుతున్నాము ప్రతి ఒక్కరూ స్పందించి మీ అభిప్రాయం చెప్పవలసినదిగా కోరుతున్నాము ఎవరుచెప్పిన మాటకువారు తప్పనిసరిగా కట్టుబడి ఉండాలి సో ఆలోచించి మీ అభిప్రాయం చెప్పండి
  N.S.KUMAR
DN PRESEDENT
AIGDSU, PRAKASAM DIVISION.

Monday 16 July 2018



పరిష్కరించబడని ఏ సమస్యను మానవ సమాజం సృష్టించుకో దు. పరిష్కరింప బడే సమస్యనే మానవ సమాజము సృష్టించుకుంటుంది అ ని కారల్ మార్క్స్ చెప్పాడు కానీ 60 ఏళ్లుగా గ్రామీణ తపాల ఉద్యోగులు సమస్య ఎందుకు పరిష్కారం కావడంలేదు.  దీనికి కారణం ఎవరు ప్రభుత్వం ఎప్పుడు ఇలాంటి ఉద్యోగుల సమస్యను పరిష్కరించదు మరి యూనియన్ల పాత్ర ఈ విధముగా ఉన్నది మనము అర్థం చేసుకోవాలి .నేర్పు ఓర్పు త్యాగ పురీత పోరాటం ఉంటే కచ్చితంగా ఈ సమస్య కూడా పరిష్కారం అవుతుంది జిడిఎస్ లకు జిడిఎస్ లే నాయకులుగా ఉంటే సమస్య పరిష్కారం అవుతుందని భావించాం కానీ జెసి ఏకు జిడిఎస్ లే నాయకులుగా ఉన్న మన సమస్య పరిష్కారం కాలేదు సమ్మె విరమణ లో సమయస్ఫూర్తి ప్రదర్శించక అనాలోచితంగా సమ్మెను విరమించడం కారణంగా కనీసం కొన్ని సమస్యలు అయినా పరిష్కారం కాలేదు ఇంతటితో మనం నిరాశ చెందక గత ఉద్యమాల అనుభవాలను గుణపాఠంగా తీసుకుని పోరాడితే కచ్చితంగా మన సమస్య పరిష్కారం అవుతుంది ఆ దారిలోనే జిడిఎస్ అందరం జి సి ఏ గా మార్పు చెందడం గొప్ప పరిణామక్రమం. సమస్య పరిష్కారం కావాలంటే పట్టువదలని విక్రమార్కునిలా నిరంతరం ఈ పాలకులపై అధికారులపై పోరాడవలసిన డే అందుకు ఐక్య ఉద్యమాలే మనకు మంచి ఫలితాలనిస్తాయి. Jca ను
 యుద్ధానికి సిద్ధం చేస్తూ వారికి మనోధైర్యాన్ని ఇస్తూ బలాన్నిస్తుంది మన వంతు బాధ్యతాయుతమైన మాటలను మాట్లాడుదాం. Jca ను నిరాశ పరచడం కంటే వారికి ఆత్మస్థైర్యాన్ని మన అందరి తరఫున పోరాడవలసిన దిగా మరీ మరీ మరీ కోరుదాం......KB