Tuesday, 22 August 2017

కామ్రేడ్స్, అసలేమి జరిగింది ఎందువలన సమ్మె ఆపవలసి వచ్చింది, సమ్మె వలన మనకొచ్చిన ప్రతి ఫలమేంటి అని అనేక ప్రశ్నలు మనలో తలెత్తుతున్నవి, ఒక వైపు నాయకులపై కోపం మరో వైపు ఎందుకొచ్చామా ఈ ఉద్యోగంలోకి మనస్సులో బాధ... అన్ని విషయాలకు ఈ కొంచెం చదవండి....15-08-2017 లోపు కమిటీ రిపోర్ట్ అమలు చేయకుంటే 16 నుండి నిరవధిక సమ్మెలోకి వెళ్తామని నెలన్నర ముందుగా యూనియన్ హెచ్చరికలు చేసిన సంగతి తెలిసినదే, తర్వాత కమ్యూనికేషన్ మంత్రిగారు స్వయంగా మన డి.జి.ఆఫీస్ కు వచ్చి మన ఫైలును తపాలాశాఖ నుండి క్లియర్ చేయించారు దీనిలో విషేశమేంటంటే మనకోసం మన రిపోర్ట్ కోసం డి.జి.ఆఫీస్ శని,ఆదివారం కూడా పనిచేసింది ఇది మన యూనియన్ గొప్పతనం కాదా‍? తర్వాత ఫైలును పైనాన్స్ మినిష్టర్ ఆఫీసుకు పంపించడం అక్కడ ఇప్పటకి క్లియర్ కాకపోవటం మనకందరికీ తెలిసిన విషయమే, ఈతరుణంలో మనం ఇచ్చిన హెచ్చరికలు ప్రకారం సమ్మెకు సన్నద్దమైన టైమ్ లో పోస్టల్ కార్యదర్శి గారు మన నాయకులను 14వతారీఖున చర్చలకు పిలవటం చర్చలలో 2లేదా3 రోజులలో ఫైలు క్లియర్ చేపిస్తానని మాటిచ్చారు అయినాకూడా మన యూనియన్ నమ్మక సమ్మెలోకి వెళ్లుటకు నిశ్చయించుకొని సమ్మెలోకి దిగాం. తర్వాత మూడుదఫాలు చర్చలు జరిగినవి, చర్చలు అసంపూర్ణంగా ముగిసిన సంగతి అందరకీ తెలిసినదే, తర్వాత మంత్రిగారు ఈవిషయంలో ఇన్వాల్వ్ అయ్యి సమ్మె మానుకోని వస్తేగాని మీతో చర్చలు జరపమని ఖరాఖండిగా అల్టిమేటమ్ జారీ చేశారు అయినాకూడా మన యూనియన్ లెక్కచేయలేదు ఎన్ని రోజులైనా సమ్మె చేయుటకే సిధ్దమైంది అదేవిదంగా సమ్మెను కొనసాగిస్తున్నది, ఈ తరుణంలో నిన్న వెల్ఫేర్ కమిటీ మీటింగ్ జరిగినది ఈ కమిటీలో యన్.యఫ్.పి.ఇ, యఫ్.యన్.పి.ఒ, బి.యం.యస్, యస్.యసి. యస్.టి అసోషియేశన్ మరియు ఎ.ఐ.జి.డి.యస్.యు పాల్గొనాలి, ఈ మీటింగ్ కు మంత్రిగారు అధ్యక్షత వహిస్తారు, మన యూనియన్ ను తప్ప అన్ని యూనియన్ లను ఈ మీటింగ్ కు పిలిచారు, సమ్మె మానుకోని మీరు కూడా మీటింగ్ కు రమ్మన్నారు, కానీ మన యూనియన్ ,సమ్మె చేయుటకే ప్రాధాన్యతను ఇచ్చింది. మధ్యాహ్నం 1 గంటకు మీటింగ్ అయిపోయింది మంత్రిగారు వెళ్లిపోయారు. తర్వాత పోస్టల్ కార్యదర్శిగారు సెలవులో ఉండుటవలన డి.జి.గారికి పోన్ చేసి మరొక్కసారి మన యూనియన్ తో చర్చలు జరపమని ఆదేశించారు, నిన్న సాయంత్రం 5-30 కు మరలా డి.జి.ఆఫీసులో చర్చలు మరలా చర్చలు పెయిల్. తర్వాత మినిష్టర్ చాంబర్ నుండి మన యూనియన్ కు 7-00 గంటలకు పోన్ వచ్చింది, ఒక్కసారి చాంబర్ కు రమ్మన్నారు . మన నాయకులు మినిష్టర్ చాంబర్ కు వెళ్లారు, తపాలాశాఖ తరుపున ఒకరిని పిలిచారు , తపాలాశాఖ తరుపున శైలేంద్ర దశోరా, డి.డి.జి. యస్.ఆర్ లీగల్ హాజరయ్యారు. మినిష్టర్ చాంబర్ లో మినిష్టర్ ఆఫీసు అధికారులు మరియు మినిష్టర్ పి.ఎ , మన యూనియన్ నాయకులు మరియు డి.డి.జి గారు చర్చలకు కూర్చున్నారు. ఇప్పటికే ఐదుసార్లు చర్చలు జరిగినవి ఎందుకు చర్చలు విఫలమవుతున్నవని పి.ఎ లేవనెత్తాడు, అసలు మీరేమి అడుగుతున్నారు వాళ్లేమి చెబుతున్నారని అడిగారు. దానికి మన యూనియన్ నాయకులు 1 . డిమాండ్ గురించి చెబుతూ మాకు ఒక తారీఖులోపు ఇంప్లిమెంట్ చేస్తామని ఎస్యూరెన్స్ తోకూడినా అగ్రిమెంట్ ఇవ్వండని మేము అడుగుతున్నాం డిపార్ట్ మెంట్ ఇవ్వటంలేదని మన నాయకులు చెప్పారు, మినిష్టర్ ఆదేషాలనుసారం మినిష్టర్ పి.ఎ గారు కల్పించుకొని వారంరోజులలోపే ఫైలును క్లియర్ చేయిస్తానని మినిష్టర్ గారు చెప్పారు అని చెప్పారు , తర్వాత మన యూనియన్ నాయకులు కమిటీ రిపోర్ట్ పైనాన్స్ లో క్లియర్ అయినవెంటనే త్వరగా ఇంప్లిమెంట్ చేయాని డిమాండ్ చేసింది, దానికి పి. ఎ గారు ఎటువంటి ఆలస్యం జరగకుండా చూసుకునే బాధ్యతమాది అని హామీ ఇచ్చారు, తర్వాత తపాలాశాఖ కమిటీ రిపోర్ట్ ను తారుమారు చేసి పైలు తయారుచేసిందనేది మా అనుమానం  దానిని యాజిటీజ్ గా ఇంప్లిమెంట్ చేయకుండా మా యూనియన్ తో సంప్రదింపులు జరిపిన తర్వాతే పైనల్ చేయాలని డిమాండ్ చేసింది, దానికి ఒప్పుతుంటూ మనకు అగ్రిమెంట్ ను మినిష్టర్ ఆఫీసు అధికారులు వారి చాంబర్ లో ఇప్పించటం మన సమ్మె ప్రభావమే, ఇదివరకెన్నడూ మినిష్టర్ చాంబర్ లో చర్చలు జరగలేదు ఈ సమ్మె ప్రభావం అటువంటిది, తపాలాశాఖ ను దాటి ప్రభుత్వం దృష్టికి మన సమస్య వెళ్లింది, ఇది ఒక గొప్ప అచీవ్ మెంట్, 2. రెగ్యులరైజేషన్  డిమాండ్ పై సుదీర్ఘంగా చర్చ జరిగింది, క్రొత్త క్రొత్త పథకాలు ప్రవేశపెడుతున్నాం అవి పూర్తిగా ఇంప్లిమెంట్ అయిన తర్వాత ఈ డిమాండ్ గురించి ఆలోచిస్తామని చెప్పారు, మూడవ డిమాండ్ అయిన పెన్షన్ గురించి అది హైకోర్టులో ఉంది మీకు అనుకూలంగా తీర్పు వస్తే పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని చెప్పారు,నాల్గవ డిమాండ్ గురించి ముందుగానే లెటర్ ఇచ్చిన సంగతి తెలిసిందే, ఇదివరకెప్పుడూ మినిష్టర్ చాంబర్ లో చర్చలు జరగలేదు ఇప్పుడు మాత్రమే జరిగినవి అంటే మనం తపాలాశాఖ దాటి ప్రభుత్వం దృష్టిలో పడ్డాము, ఈ సమ్మె ప్రభావం ఖచ్చితంగా ప్రజలపై, ప్రభుత్వంపై పడిందనేది అక్షరసత్యం. ఇది అందరి ఐక్యత వలన సాధ్యపడింది, విషయాన్ని మంచి మనస్సుతో అర్ధం చేసుకుంటారని కోరుకుంటూ , మనం ఒక్కసారి నిరవధికసమ్మె చేస్తే రెగ్యులర్ అయిపోతామని కొంతమంది కుర్రాళ్లు భావిస్తున్నారు, ఇలాంటి పోరాటాలి మరెన్నో చేయాలసి వస్తుంది అన్నింటికీ సిధ్దమై ఉండాలి అంతేకానీ తొందరపడటం మంచిదికాదు, మేము కూడా ఎన్నో ఆశలతో ఈ శాఖలో అడుగుపెట్టాం కానీ, మీకు ఇంకా భవిష్యత్ ఉంది,వయస్సు ఉంది వేరే ఏదైనా సాధించవచ్చు కానీ మా పరిస్థితి , మేము మా కుటుంబాలు దీనినే నమ్ముకున్నాం ఏదైతేనేమి ఈ రోజు మనం జి.డి.యస్ ఏంటో నిరూపించాం మన సమ్మె దెబ్బేంటో ప్రభుత్వానికి చూపించాం, ఇదే కొనసాగితే మనగోల్ నెరవేరినట్లే......కె.బి